ఎర్రగోళ్లపాడు గ్రామంలోని గ్రామ కంఠం భూమిని రక్షించాలి-సిపిఎం పార్టీ
జనగామ జిల్లా ఎర్రగోళ్లపాడు గ్రామంలోని గ్రామ కంఠం భూమిని రక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవీందర్ కి సిపిఎం మండల నాయకులు అజ్మీర సురేష్ నాయక్ వినతి పత్రం అందజేశాడు.ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ..జనగామ మండలంలోని ఎర్రగోళ్లపాడు గ్రామంలో సర్వే నెంబర్ 34 లో గ్రామ కంఠం భూమిలో గ్రామ పంచాయతీ భవనము నిర్మాణం చేయడం జరిగిందని దానికి ఆనుకొని పక్కన ఉన్న భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నాడు.కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ గ్రామ కంఠం భూమి పై కన్నేసి దీని చుట్టుపక్కల లేని సర్వే నెంబరు 6 ను ఈ గ్రామ కంఠం భూమి హద్దులుగా పెట్టి రిజిస్టర్ డాక్యుమెంట్ సృష్టించి కోర్టులో కేసు వేసి ఇది మా భూమి అని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఇట్టి విషయంపై జనగామ ఎంపీడీవో అదే విధంగా జనగామ తహసిల్దార్లకు ఫోను ద్వారా ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని పంచాయతీ సెక్రెటరీ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సింది పోయి కమిషన్లకు కకృత్తి పడి పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా ఎంపీడీవోకు ఆర్ఐ చేతుల మీదుగా ఎమ్మార్వోకు ముడుపులు ఇచ్చినట్లు ప్రైవేటు వ్యక్తులు గ్రామంలో అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని అన్నాడు.జిల్లా కలెక్టర్ రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ గ్రామ కంఠం భూమిని రక్షించాలని భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని పార్కు బోడును క్రీడా ప్రాంగణం బోర్డును తొలగించిన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నాడు.