
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రాన్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పల్లె నాగేశ్వరరావుని పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా.. కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు పడిశాల రఘు మాట్లాడుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో మన కోదాడవాసి విజయం సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాబోవు రోజులలో పల్లె నాగేశ్వరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు… తోటపల్లి నాగరాజు, కుడుముల సైదులు, చెరుకుపల్లి శ్రీకాంత్, చీమ శేఖర్, గంధం వెంకటనారాయణ,శ్రీహరి, కుర్రా రామారావు, బండి శీను, సతీష్, శ్రీనివాస్, నజీర్, రవి తదితరులు పాల్గొన్నారు