ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఎస్ కన్వెన్షన్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, హాజరయ్యారు.నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల 256 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, అలాగే డిఆర్డిఏ ఆధ్వర్యంలో వ్యవసాయ మోటార్లు పంపిణీ
చేయడం జరిగింది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ
పేదలందరికి స్వంత ఇంటి కళా నెరవేర్చడమే తమ లక్ష్యం అని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,360 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. రాబోయే 2–3 నెలల్లో మరో 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నట్టు వివరించారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని హెచ్చరించారు. మహిళా సంఘాల ద్వారా అవసరమైతే లోన్లు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు అని అన్నాడు.
ఎంపీ డా. కావ్య మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలన్నింటిని మహిళల పేరుమీద అమలు చేస్తుండటంగర్వకారణమన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత పాలకులు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్యానిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 1,075 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలుజరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్,ఆర్ డీ ఓ వెంకన్న, పీ డీలు,వివిధ మండలాల ఎం పీ డీ ఓ లు,వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.