
ఎస్సీ వర్గీకరణ ద్వారనే ప్రభుత్వ ఫలితాలను చేపట్టాలి
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద సోంపల్లి అన్వేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదటిరోజున చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి,బొడ్డు శాంతి సాగర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మీద అలాగే ఎస్సీ వర్గీకరణ కోరే దళిత కులాల మీద మరో కుట్ర జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాకముందే ఈ నెల 10 నుండి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించబోతున్నట్లు అలాగే ఈ నెల11 న గ్రూప్ 2,ఈనెల14న గ్రూప్ 3,ఈనెల 17న హాస్టల్ వార్డెన్ ఆఫీసర్,ఈనెల19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్,ఫలితాలు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించినది అంటే ఎస్సీ వర్గీకరణ జరకముందుకే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మాలలకు కట్టబెట్టాలని కుట్ర ప్రారంభమైనది దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నట్లు మాదిగలను వర్గీకరణ కోరశక్తులను భ్రమల్లో పెడుతూనే మరోపక్క మాలల ఒత్తిడికి తలోగ్గి మాదిగ ప్రజలకు మరియు ఎస్సీ వర్గీకరణ కోరే దళిత కులాలకు తీరని అన్యాయం చేయబోతుంది,ఈ కుట్రలను తక్షణమే ఎదురుకోవడం మన ముందున్న ప్రథమ కర్తవ్యం కర్తవ్యంగ గుర్తించి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ మరియు ఎమ్మెస్ పి అనుబంధ సంఘాల ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయి వర్గీకరణ చట్టం ద్వారానే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగ నియామకాలను ఉద్యోగ ఫలితాలను చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ దీక్షలో పాల్గొన్నవారు పుట్ట ప్రశాంత్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు,మాచర్ల బాబు మాదిగ వీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు,చిలుక రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి,బొడ్డు రమణాకర్ బీఆర్ఎస్ మండల నాయకులు ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కొట్టె శంకర్,పుట్ట ప్రదీప్,బొడ్డు ప్రణయ్,పుట్ట చైతన్య,కమ్మపాటి స్వామి,ఎలా అభిషేకు,గంగారపు ప్రవీణ్,దేవర సంపత్,కొట్టె సృజన్,తదితరులు పాల్గొన్నారు.