ఎస్.ఎఫ్.ఎ.లకు కనీస వేతనం 35 వేల రూపాయలు ఇవ్వాలి
- జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం.
- ఈ సందర్భంగా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు, ఎం.దశరథ్, సి.మల్లేష్ మాట్లాడుతూ,
జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్.ఎఫ్.ఎ.)లు దాదాపుగా 900 మంది పని చేస్తున్నారు. వీరు హైదరాబాదు నగర అభివృద్ధిలో హైదరాబాద్ శుభ్రత లో హైదరాబాద్ క్లీన్ అంద్ గ్రీన్ గా ఉంచడంలో వీరి కృషి అమోఘమైనది, హైదరాబాద్ నగరానికి అనేక అవార్డులు, రివార్డులు వస్తున్నాయంటే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (SFA) లా పాత్ర ఘనంగా ఉంది. వీరు మున్సిపల్ కార్మికుల తో పని చేయించడం వారిని టైం కు హాజరు పరచడం ఎక్కడ ఏ చెత్తాచెదారం ఉన్న వారితో వెంటనే క్లీన్ చేయించడం జరుగుతా ఉంది పై అధికారులతో గానీ, లోకల్ లీడర్లతో కానీ ఎవరితో మాట పడకుండా ఎవరు వీరి మీద కసురుకున్న ఎవరు వీరిపై దబాయింపు బెదిరింపులకు పాల్పడిన, ఎవరిపై కోప పడకుండా వీరు హైదరాబాద్ నగరం ని క్లీన్ గా ఉంచడం కానీ శుభ్రంగా ఉంచడం కానీ వీరు పని చేస్తున్నారు. కానీ వీరికి వేతనాలు మాత్రం చాలా అన్యాయంగా ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు వీరికి వేతనాల్లో ఏమాత్రం తేడా లేదు. వీళ్ళు మానసిక ఒత్తిడితో పని చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు ఫిజికల్ గా పనిచేస్తున్నారు. అంతే తేడా, కానీ వీరికి అదనంగా పని భారంతో పాటు వీరికి పెట్రోల్ ఖర్చులు, అలాగే ఫోను డేటా ఫోన్ ఖర్చు, అధికారుల వత్తిడితో పని భారం పని గంటలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధులు,MLA లు, మంత్రివర్యుల పర్యటనలు, ఎలక్షన్ డ్యూటీలు, బి ఎల్ ఓ డ్యూటీలు, అదనపు కార్యక్రమాల భారం కూడా పడుతుంది.
కానీ వీరికి అదనపు ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి గాని ఏ మాత్రం కూడా వేతనాలు పెంచడం లేదు, ఒకవైపు నిత్యవసర సరుకుల ధరలు పెరిగి పోతా ఉన్నాయి. ఇంటి అద్దెలు, స్కూలు ఫీజులు, పండుగలు ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. వీరికి మాత్రం జీతాలు పెరగట్లేదు. కావున సిఐటియు కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేయడమేమనగా జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికుల శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 35 వేల రూపాయలు పెంచాలని, గత మూడు సంవత్సరాలుగా వివిధ సందర్భాలలో అధికారులకు ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. మరణించిన ఎస్ ఎఫ్ ఏ ల కుటుంబాల సభ్యులను తక్షణమే పనిలోకి తీసుకోవాలి. డ్యూటీలో ఉండి మరణించిన ఎస్,ఎఫ్,ఏ,లకు 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలి, ఎస్.ఎఫ్.ఎ.లకు రోజురోజుకు పని భారం పెరుగుతుంది. వివిధ సందర్భాలలో స్పెషల్ ప్రోగ్రామ్స్ రావడంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9:00 వరకు పని పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కావున వీరికి పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 35 వేలకు పెంచాలని. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు జిరాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అంబర్పేట జోన్ కన్వీనర్ బి శ్రీనివాస్ పాల్గొన్నారు.