
లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
ఈ69 న్యూస్, పామిడి.
పామిడి లయన్స్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పామిడి లైన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు తెలిపారు. ఈ ఎన్నిక గురువారం లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ విరుపాక్షి రెడ్డి సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. పామిడి లైన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా. కే.రఘువీర్, ప్రధాన కార్యదర్శిగా పట్రా శ్రీనివాసులు, కోశాధికారిగా డి. షేక్షావలి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లైన్స్ క్లబ్ వైస్ గవర్నర్ విరుపాక్షి రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లయనిజం అనేది ప్రపంచంలో 200 పైగా దేశాలలో పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ లైన్స్ క్లబ్ అని ఆయన పేర్కొన్నారు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి తోటి వారికి సాయం చేయాలనే గుణం కలిగి ఉండాలన్నారు. మనకు సాయం చేసే వారికే కాకుండా అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలడం దైవత్వం అన్నారు. సేవా దృక్పథాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అతి స్వల్ప కాలంలోనే 9 వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వారిచే చేయించిన ఘనత పామిడి లయన్స్ క్లబ్ నకు దక్కిందని ఆయన అన్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు పామిడి లైన్స్ క్లబ్ సభ్యులు నిర్వహించినందుకు పామిడి లైన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నానన్నారు. పామిడి లైన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పేదరికం ను నిర్మూలించేందుకు పామిడి లైన్స్ క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం సేవా కార్యక్రమాలే లక్ష్యంగా లైన్స్ క్లబ్ కృషి చేస్తుందన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ఆరోగ్యం పరంగా సేవా కార్యక్రమాలను చేపడుతూ తోటి వారిని సేవా దృక్పథం వైపుగా నడిపిస్తున్నామంటూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకొని భాగస్వాముల కావాలని కోరారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనందిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో లైన్స్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు వెల్లడించారు.