ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాల కొరకు ప్రత్యేక చట్టం చేయాలి
ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ దుమ్ముగూడెం మండల శాఖ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఏటిఏ విధి విధానాలపై చర్చ చేశారు. అంతేకాకుండా మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు మరియు జనరల్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు . బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లక్ష్మి నగరం (కె.రేగుబల్లి-1)నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఏటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు మరియు బదిలీలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పనకు “ప్రత్యేక చట్టం” రూపొందించుటకు తక్షణమే ట్రైబల్ అడ్వైజరి కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అప్గ్రేట్ అయిన కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలకు ఉపాధ్యాయ మరియు బోధనేతర సిబ్బందికి పోస్టులు మంజూరు చేసి నియమకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం సూపర్ న్యూమరి పోస్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటేషన్ కల్పించాలని, పి ఈ టి, హెచ్ పి-II మరియు తెలుగు పండిట్స్ -2 టు లను అప్ గ్రేట్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని,ఆశ్రమ పాఠశాలల డైట్ బిల్స్ ను తక్షణమే క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో అపక శ్రీనివాసరావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు యస్.సావిత్రి,సోడి కృష్ణార్జున రావు,యం.శ్రీదేవి, ఢి సుజాత, గుండి లత, మహాలక్ష్మి,తెల్లం రామకృష్ణ, తెల్లం సరస్వతి,కొర్స రాజేష్,కుర్సం వినోద్ బాబు,ఉయిక దశమి బాబు,సోయం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.