
ములుగు వార్తలు mulugu news
పంచాయతీ రాజ్ &శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు
గురువారం రోజున పంచాయతీ రాజ్ &శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలమేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్,నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పాల్గొని దరఖాస్తు ఫారంలోని సందేహాలకు వివరణ ఇస్తూ ప్రజలకు తెలియజేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల పార్టీ అద్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ ప్రజా పాలనలో అభయహస్తం ఐదు గ్యారంటీలను అమలు చేయడం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని గడీల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గరీబ్ పాలనలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా,సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమానంగా సమానత్వం సమన్యాయం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పలాలు అందుతాయని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్న 200 నుండి 500 రూపాయలు అయ్యేటివని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు ఫారం కూడా లబ్ధిదారుడిని ఇంటికి వెళ్లి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అణగారిన జనాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి మనోజ్ కుమార్,PACS vice president చెన్నూరు బాలరాజు,జిల్లా ఉపాధ్యక్షులు MD ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహరావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీను, మండల నాయకులు ఉమ్మనేని రమేశ్,వార్డ్ సభ్యుల రంజిత్, తెల్లం నాగమణి, మహిళ టౌన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల సరితక్క, ఏళ్లేశ్ గౌడ్, కందుకూరి సుధాకర్ అధికారులు పాల్గొన్నారు.