ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.ధాత్రి రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి గ్రామానికి చెందిన ధాత్రి రెడ్డి 2019లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆమె మరోసారి సివిల్స్ రాసి జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించారు అంతకుముందు డచ్ బ్యాంకులో పనిచేసిన ఆమె ఖరగ్ పూర్ లో ఐఐటి విద్యను అభ్యసించారు పాడేరు కలెక్టర్ గా పని చేస్తూ ఏలూరు జిల్లాకి బదిలీ అయ్యారు ప్రస్తుతం ఏలూరు ఎస్పీగా ఉన్న కె.పి.ఎస్ కిషోర్ సతీమణి ధాత్రి రెడ్డి కావడం విశేషం