
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ.ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిల్పూరు మండలంలోని వెంకటేశ్వర పల్లె గ్రామానికి చెందిన బట్ట మేకల శివరాం యాదవ్, బట్ట మేకల ధర్మరాజు యాదవ్ అన్నదమ్ముల ఇద్దరి వద్దా 558 గజాల భూమిని ఇద్దరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం కోసం 22 వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందన్నారు. వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బట్ట మేకల శివరాం యాదవ్ నుండి రూపాయలు 20000 డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ రామకృష్ణని రిజిస్టర్ ఆఫీసులో ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ 6 నెలల ముందే జనగామ నుంచి స్టేషన్ ఘన్పూర్ కు బదిలీపై వచ్చారు. అధికారులు విచారణ చేపట్టారు ఇంకా పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు ఏసిబి డి ఎస్ పి సాంబయ్య,ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు,ఎస్ రాజు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.