
telugu galam news e69news local news daily news today news
ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ సోమవారం నాడు తన చాంబర్లో నిర్వహించిన గిరిజన దర్బార్ లో మారుమూల ప్రాంతాల నుంచి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనులనుండి ఆయన అర్జీలు స్వీకరించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి యూనిట్ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు వచ్చిన దరఖాస్తులలో కరెంటు మోటార్ కొరకు భూ సమస్యలు ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు కొరకు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులను సమర్పించారని గిరిజన దర్బార్లో సమర్పించిన అర్జీలను ప్రత్యేకమైన రిజిస్టర్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలను విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించటానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్ అగ్రికల్చర్ ఏడి ఉదయ భాస్కర్ ఏపీఓ పవర్ మునీర్ పాషా మేనేజర్ ఆదినారాయణ నాగభూషణం కృష్ణార్జునరావ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.