
ఈ69 న్యూస్,హన్మకొండ/ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావును ఆ బాధ్యతల నుండి విముక్తి చేస్తూ,దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్,హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్-I కార్యనిర్వహణాధికారిగా ఉన్న కె.సుధాకర్ నూతనంగా ఐనవోలు దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను.భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాను.దాతలు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను.అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలని కోరుతున్నాను”అని తెలిపారు.