
ఐనవోలు భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవం
హన్మకొండ జిల్లా అయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల మూడవ రోజున అమ్మవారు చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు దర్శనం మిచ్చారు.ఉత్సవాలలో నిత్యాహ్నికం చక్రోపనిషత్ పారాయణం,శ్రీచక్రాచన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ వేడుకలో చైర్మన్ కమ్మగాని ప్రభాకర్ గౌడ్,ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్,ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,ఐనవోలు మధుకర్ శర్మ,వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి,అర్చకులు నందనం భాను ప్రసాద్,మధు శర్మ, శ్రీనివాస్,నరేష్ శర్మ,దేవేందర్ మరియు భక్తులు,ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ ఈ కార్యక్రమ వివరాలను మీడియాకు తెలిపారు.