
ఐనవోలు మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఈ69న్యూస్ హన్మకొండ/ఐనవోలు
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి,కేక్ కట్ చేసి,పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐనవోలు బిఆర్ఎస్ మండల కన్వీనర్ తంపుల మోహన్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపెల్లి చందర్ రావు,మండల ఇంచార్జ్ గుజ్జ గోపాల్ రావు,కొఆప్షన్ మెంబెర్ ఉస్మాన్ అలీ పాల్గొన్నారు.అదే విధంగా మాజీ సర్పంచులు పల్లకొండ సురేష్,కావేటి స్వామి,గ్రామ పార్టీ అధ్యక్షులు కుమార్,చందర్,కొమురయ్య,సోమయ్య,ఏలీయా,ఎల్లగౌడ్,అశోక్,రఘువంశీ గౌడ్,వెంకటరమణ,మహేష్,చందు,రాజు,చంటి,రవి తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.సమాజంలో సమానత్వం,న్యాయం,స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.