
ఈ69న్యూస్ హన్మకొండ జిల్లా:- ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ శనివారం లెక్కింపు జరిగింది.హుండీ ఆదాయం తేది.04.03.2025 నుండి 29.03.2025 వరకు 25 రోజులకు రూ. 25,96,561/-వచ్చినది.వివిధ అర్జీత సేవ టిక్కెట్ల ద్వారా రూ.96,29,000/- ఆదాయం సమకూరింది.మొత్తం రూ. 1,22,25,561/- ఆదాయం వచ్చింది.హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగింది.ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇందులో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు,ఐనవోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ జి.పరమేశ్వరి,యాస్మిన్,శ్రీనివాస్ అర్చక సిబ్బంది,ఒగ్గు పూజారులు మజ్జిగ మహేందర్,అశోక్,శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి,మహబూబాబాద్ సభ్యులు పాల్గొన్నారు.