
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మాస సంక్రమణ ప్రత్యేక కార్యక్రమాలు
ఈ69న్యూస్ హన్మకొండ
మాస సంక్రమణను పురస్కరించుకుని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా బలిజ మేడాలమ్మ,గొల్ల కేతమ్మలతో పాటు శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం,మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,రుద్రహోమం,ఒగ్గు పూజారులచే పెద్దపట్నం వేయడం వంటి వైభవోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్,అయినవోలు మధుకర్ శర్మ,వేద పండితులు విక్రాంత్ వినాయక జోషి,భక్తులు,అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.