
ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలర్ శిక్షణ కేంద్రాన్ని గ్రామ నాయకుడు మహమ్మద్ రఫీ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా.పరికి సుధాకర్ (సిరి సంస్థ డైరెక్టర్),కోనేటి శంకర్ రెడ్డి,పెండ్లి సంపత్,పెండ్లి లక్ష్మీనారాయణ,అద్దంకి రమేష్,అద్దంకి నరసింహారావు,నరసింహచారి,నూనె రాజయ్య,కూనూరు రాజిరెడ్డి,శంకరయ్య,ఎండి పాషా,మండల కుమారస్వామి,టీచర్ స్వప్న,భాగ్య,నిర్మల,అనిత,శిరీష,మానస,రజిత,రమ,రాధిక,మౌనిక తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ..“మహిళల కోసం ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది.ఈ మూడు నెలల శిక్షణను పూర్తిగా వినియోగించుకొని ఆర్థికంగా స్వావలంబిగా మారాలి,”అని సూచించారు.అలాగే శిక్షణ ఏర్పాటు చేసిన డా.పరికి సుధాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.డా.పరికి సుధాకర్ మాట్లాడుతూ..“ఇది మా సంస్థ ఏర్పాటుచేసిన 29వ శిక్షణ కేంద్రం.ఇప్పటి వరకు 28 కేంద్రాల ద్వారా వేలాది మహిళలకు శిక్షణ ఇచ్చాం.ఈ శిక్షణ ద్వారా మహిళలు తమ దుస్తులను తామే కుట్టుకునే స్థాయికి ఎదగగలుగుతారు,”అని వివరించారు.గతంలో శిక్షణ పొందిన నిరుపేద మహిళలకు 15 కుట్టుమిషన్లు అందించామని,ఈ గ్రామంలో శిక్షణ పూర్తి చేసిన నిరుపేద మహిళలకు కూడా అవసరమైతే ఉచిత మిషన్లు ఇవ్వాలని చెప్పారు.శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా అందజేయబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీ వేణుగోపాల్,రాజు,మహిళలు,వార్డు పెద్దలు,గ్రామ పెద్దలు,గ్రామపంచాయతీ సిబ్బంది,శిక్షణ పొందే అభ్యర్థులు మానస,అనిత,స్వప్న,రాధిక,మౌనిక,రిస్మిత తదితరులు హాజరయ్యారు.