ఒంటిమామిడిపల్లి పిఎం స్కూల్ విద్యార్థుల ఘన విజయం
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పిఎంఎస్హెచ్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ ఒంటిమామిడిపల్లి పాఠశాల పదోతరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.44 మంది విద్యార్థుల్లో 43 మంది ఉత్తీర్ణులయ్యారు.మజ్జిగ నితిన్ (527),రాజరాపు వరుణ్ (526),బుర్ర హర్షిత (525) ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపారు.విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు,మేనేజ్మెంట్ వారి కృషిని ప్రశంసించారు.