bhadradri kothagudem news
బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో శిక్షణా కార్యక్రమం
గళం న్యూస్ / దుమ్మగూడెం సెప్టెంబర్24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల తహసీల్దార్ ఎం అశోక్ ఓటర్ల జాబితా కార్యక్రమమును వేగవంతం చేశారు. గురువారం నాడు తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అనేక విషయాలను వివరించారు తహసిల్దార్ అశోక్. అందులో ముఖ్యంగా హౌస్ టూ హౌస్ సర్వే ఓటర్ యొక్క ఫోటో, అడ్రస్ సరి చేయడం, ఆధార్ నమోదు కాని వివరములు శేఖరించుట,
ఓటు లేని వారికి కొత్త ఓటు నమోదు, ఫారం 6, 7,8 లా గురించి వివరించటం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం బూత్ లెవెల్ ఆఫీసర్లకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.