
ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తున్న…తహసిల్దార్ నాగేశ్వరరావు
ఓటర్ నమోదు పై యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తాసిల్దార్ టీ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన
చెక్ ఓటర్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నూతన ఓటరుగా నమోదు చేసుకున్నవారు తమ పేరు నమోదు అయినదో లేదో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినందున ప్రతి ఓటర్ చెక్ చేసుకోవచ్చన్నారు. ఈనెల 19 వరకు 18 సంవత్సరాల నిండిన యువత నూతన ఓటర్ గా నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఆన్లైన్ ద్వారా గాని మీ ప్రాంత బియల్ఓ ల ద్వారా గాని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ గోపాలరావు, ధరణి ఆపరేటర్ వెంకయ్య, బి ఎల్ ఓ లు సవిత, కవిత, నాగేశ్వరరావు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.