తలారి సత్య బ్రూస్లీ కి గోల్డ్ మేడల్.. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీషా, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.సబ్ జూనియర్ విభాగంలోని 16 కేజీల కేటగిరీలో అనంతపురం జిల్లా కనుంపల్లి గ్రామానికి చెందిన తలారి సత్య బ్రూస్లీ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించి అందరి ప్రశంసలు పొందాడు.కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ విజయంతో తలారి సత్య బ్రూస్లీ పేరు మరో మెట్టు ఎక్కింది.జాతీయ స్థాయిలో అనంతపురం ప్రతిభ మెరిసింది… తలారి సత్య బ్రూస్లీకి మా అభినందనలు!