
ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వర్గ పోరే-కాంగ్రెస్ పార్టీ సింగపురం ఇందిరా వర్గీయులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని ఐ కాన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ మామిడాల యాదిరెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు చేపూరి రాజశేఖర్,పెద్ద పెండ్యాల గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తపల్లి బిక్షపతి మాట్లాడుతూ..గత 30 సంవత్సరాలుగా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా కాంగ్రెస్ జెండా మోసి,జైలు పాలై,అవమానాలు భరించి అసలు కాంగ్రెస్ పార్టీనే లేదు అని హేళన చేసినప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల్ల ఊరిలో ఒక్కరమైన జెండా పట్టుకుని తిరిగాము 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో పట్టుమని పదివేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు లేకపోయినా కష్టకాలంలో సింగపురం ఇందిర 2017 నుండి కార్యకర్తల వెన్నంటి ఉన్నారు, 2023 ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనే ధైర్యంతో జీవిస్తున్న మాకు చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని లెక్కచేయకుండా తనతో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులలో అధికారం కట్టబెడుతూ అసలు సిసలైన కాంగ్రెస్ వాదులను అణగదొక్కుతున్నారు.ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను అణిచివేయాలని కుట్రలు చేసిన కడియం శ్రీహరి నేటికి ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వర్గ భేదాలు లేవనెత్తుతాడు తనకు సంబంధించిన వర్గానికి న్యాయం జరిగేలా చూసుకుంటాడు,ఇది ఇలాగే కొనసాగితే ఇక నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా కడియం శ్రీహరిని విబేదిస్తూనే ఉంటాము,అతి త్వరలో గాంధీ భవన్ వరకు వెళ్లి మా గోడును చెప్పుకుంటామన్నారు.మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళ మండల ప్రధాన కార్యదర్శి నారగోని పద్మ,మాజీ ఎంపీటీసీ సింగపురం దయాకర్,లింగంపల్లి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ బాలరాజు,చిలుకూరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చాగంటి మనికుమార్,జోగు ప్రశాంతి,జోగు రామచంద్రు,మంద ఆరోగ్యం,ఏలియా,ఐలపాక భూషణం,దివాకర్,పిల్ల గౌడు,రాజరపు ఎలియ తదితరులు పాల్గొన్నారు.