జనగామ జిల్లా చిల్పూరులో బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కొత్త బిచ్చగాడు తిరిగినట్టు ప్రచారం చేస్తున్నాడు", "15 ఏళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాడు", అంటూ మండిపడ్డారు. చిలుపూరు గుట్ట ఆలయానికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని, గ్రామీణ దేవాలయాల అభివృద్ధిలో కడియం పాత్ర శూన్యమన్నారు.‘‘కడియం అంటే కమిట్మెంట్ కాదు, కన్నింగ్’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన రాజయ్య, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.