»GMRM ట్రస్ట్ ద్వారా ప్రతి క్రీడాకారునికి T SHIRTS అందిస్తాం.
»బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు.
టేకుమాట్ల మండలం
తేదీ : 15.05.2023 – సోమవారం.
టేకుమాట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వేసవి కాలంలో గ్రామాలలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకుని యువతి, యువకులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా CM CUP పేరిట మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వెలిశాల గ్రామంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు….
వేసవి కాలంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
ఉదయం 05 గంటల నుంచి 8 గంటల వరకు,సాయంత్రం 05గంటల నుంచి రాత్రి 08 గంటలకు ఆటలను నిర్వహించాలని కోరారు.
ఆటల సమయంలో మంచినీళ్లు, స్నాక్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
GMRM ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క క్రీడాకారునికి T షర్ట్స్ అందజేస్తాం అని తెలిపారు.
కుందనపల్లి గ్రామంలో గడిచిన మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహించిన శ్రీలక్ష్మీ,భూ లక్ష్మీ బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఈ రోజు అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే గారు.ప్రతిష్ట పూజ కార్యక్రమాలకు తమ వంతుగా రూ.25వేలను వీరలంగా అందించారు.
మందలోని పల్లి గ్రామ సర్పంచ్ గారి కుమారుడు చి. నిరంజన్ రెడ్డి వెడ్స్ రమాదేవి ల వివాహం నిన్న జరిగిన సందర్భంగా నేడు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.