
జక్కలొద్దీ గుడిసె వాసుల ఆవేదన
ఈ69న్యూస్ వరంగల్
ఖిలా వరంగల్ మండలం పరిధిలోని జక్కలొద్దీ గ్రామంలోని గుడిసె వాసులు ప్రస్తుతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.స్థానికంగా నివాసం ఉండే నిరుపేద ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా స్థిరంగా జీవనం సాగిస్తూ గుడిసెలు వేసుకుని ఉంటున్న ప్రదేశాలపై కొందరు వ్యక్తులు అన్యాయంగా కబ్జా యత్నాలు చేస్తున్నారు.ప్రతిరోజూ కారుల్లో వచ్చి గుడిసెల చుట్టూ తిరుగుతూ,అక్కడి వాసులను బెదిరింపులకు గురిచేస్తున్నారని గుడిసె ప్రజలు ఆరోపించారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన ఘటనలు ఉన్నాయని వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా నిలుస్తుందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.ప్రజలతో మమేకమైన నేతలైన కొండా సురేఖ,మురళీధర్ రావు దంపతులు,వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వంటి నాయకులు తమకు అండగా ఉన్నారని వారు ధైర్యంగా చెప్పారు.గ్రామానికి అవసరమైన వాటర్, కరెంట్ వంటి మౌలిక వసతుల కోసం వారు హామీ ఇచ్చినట్టు తెలిపారు.కబ్జాదారులు తమ గుడిసెల జోలికి వస్తే,తగిన బుద్ధి చెప్పే బాధ్యతను ఈ నాయకులు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేపు గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ప్రతి ఒక్కరూ,గ్రామ కాంగ్రెస్ కమిటీ,పార్టీ కార్యకర్తలు,ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.