షాద్ నగర్ కమ్మ మహిళ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు షాద్ నగర్ లో నవోదయ సేవా సంఘం లో వృద్దులకు అన్న దానం చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం 50 కేజీ ల బియ్యం విరాళంగా అందజేశారు… ఈ సందర్భంగా మహిళా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ సమాజంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ, పేదలకు సహాయ సహకారాలు అందించటం సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు కొనసాగిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో మహిళా సేవా సమితి సభ్యులు పాతూరి ఇందిర , పినపాక మంగా దేవి, నువ్వుల రమాదేవి, వట్టికూటి విజయ తదితరులు పాల్గొన్నారు.