
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కరుణ ఆటోమొబైల్ షాప్ యజమాని, టు వీలర్ మెకానిక్ టు వీలర్ కస్టమర్ల సొమ్మును నిలువున దోచుకుంటున్నారు. గురువారం రోజున టు వీలర్ వానదారుడు నమ్మకంతో బైకును కరుణ ఆటోమొబైల్ షాప్ లో రిపేరుకు ఇవ్వగా ఎంసీ కిట్టు వేరే షాపు నుండి తీసుకొని వేశానని అబద్ధం చెప్పి అక్కడ అడగగా ఎవరు కొనలేదని వేరే షాప్ యాజమాని సమాధానం ఇచ్చారు.మరిపెడలో కరుణ ఆటోమొబైల్ షాప్ లో సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ అక్రమాలకు అడ్డగా మార్చుకున్నారు.షాప్ లో కొనుగోలు చేసిన వస్తువులకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ఏంటని అడిగిన సామాన్య ప్రజలకు బైక్ మెకానిక్ ల ద్వారా దురుసుగా సమాధానం చెప్తున్నారు.వేగంగా మారుతున్న సమాజంలో 2 వీలర్ ప్రతి సామాన్య కుటుంబానికి అవసరంగా మారిందని గమనించి నిలువున దోచుకుంటున్నారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో విచ్చల విడిగా వ్యవహరిస్తున్న ఆటోమొబైల్ షాప్ యజమానులు,బైక్ మెకానిక్ దారులు ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. రుక్మయ్య అనే మెకానిక్ రెండు రోజుల క్రితం కూడా ఓ ఎక్సెల్ బండి వాహనదారుడికి అధిక బిల్లులు వేసి ఆ వాహనదారుడుతో అడ్డగోలుగా వాగ్వాదానికి దిగాడు.బిల్లు ముందే చెప్పాలి అడిగిన వాహనదారుడు కి దురుసుగా సమాధానం చెప్పి డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడ నుండి బండి వెళ్లకూడదని చెప్పి తాళాలు గుంజుకున్నాడు. ఆటోమొబైల్ షాప్ యజమానులు,మెకానిక్ లు చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలి.