కలెక్టర్ ను కలసిన ఆర్మీ అధికారులు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను చెన్నై ఆర్మీ రిక్రూటింగ్ డీడీజీ బ్రిగేడియర్ ఆర్.కె.అవస్థి మరియు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణపై అధికారులు కలెక్టర్‌తో సమగ్రంగా చర్చించారు.ర్యాలీకి సంబంధించి భద్రత,సౌకర్యాలు,ట్రాఫిక్ నియంత్రణ,వైద్య సదుపాయాల ఏర్పాటు వంటి కీలక అంశాలను సమీక్షించారు.ర్యాలీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన నుండి అందుతున్న సహకారంపై అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.కలెక్టర్ స్నేహ శబరీష్ ర్యాలీ విజయవంతం కావడానికి అవసరమైన అన్ని సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫున అందిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు