
telugu galam news e69news local news daily news today news
భద్రగిరి లో ఉన్న కల్ప వృక్షనారసింహస్వామి చూపుతున్న లీలలు ఎన్నో అందుకే ఇక్కడకి వచ్చాము రంపచోడవరం ఎమ్మెల్యే భద్రగిరిలో కొలువై ఉన్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష నారసింహ స్వామి లీలలు అన్నీ ఇన్నీ కావు ఇక్కడ ముడుపులు కడితే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి నిత్యం వందల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి ముడుపులు చెల్లిస్తూ వస్తున్నారు.అందులోభాగంగానే ఈరోజు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిని దర్శించి ముడుపులు చెల్లించుకోవడం జరిగినది.ఈసందర్బంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కల్పవృక్ష నారసింహ స్వామికి కోరి మొక్కితే కచ్చితంగా కోరిక నెరవేరుతుందని గతం లో కూడా ఇక్కడ జరిగిన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని ఈసారి మళ్ళీ స్వామి వారి అనుగ్రహం తో తప్పనిసరిగా విజయం వస్తుందనే సంకల్పం తో ఇక్కడకి వచ్చి ముడుపులు చెల్లించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు డా.కృష్ణ చైతన్య స్వామి ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఇతర నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.