కల్ప వృక్ష నారసింహస్వామి వారిని దర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
భద్రాచలంలో కొలువైన కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామమూర్తిని ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మల్లన్న విజయం సాధించాలని వారి అనుచరులు కల్పవృక్ష నారసింహునికి ముడుపులు కట్టడం జరిగినది.ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత నేడు భద్రాచలం వచ్చిన మల్లన్న స్వామివారిని దర్శించి ముడుపులు కట్టి మొక్కలు చెల్లించుకోవడం జరిగినది.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి ఒక్కరూ బాగుండాలని, వర్షాలు సమృద్ధి గా కురిసి మంచి పంటలు పండాలని విద్య,వైద్యం వ్యవసాయ వ్యాపార రంగాలలో రాష్ట్రం ముందుకు సాగాలని స్వామి వారికి ముడుపు కట్టానని అన్నారు,మల్లన్న తో పాటు వారి అనుచరులు సైతం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగినది.