కల్లుగీత కార్మికులకు న్యాయం చేయండి
వర్ధన్నపేట మండలం చెన్నారాం గ్రామంలో పెద్ద చెరువు ఇటివల ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వర్షాలు పడ్డాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎటువంటి ఎక్సైజ్ శాఖ సంబంధించిన అనుమతులు లేకుండా తప్పుడు సమాచారం తో గీతా జీవనాధారంగా బ్రతుకుతున్న కళ్ళు గీత కార్మికులకు తెలియకుండా చెరువు గట్టు మీద ఉన్న ప్రస్తుత కల్లు పారె దిశలో ఉన్నటువంటి ఈత చెట్లను అక్రమంగా తొలగించి చెరువు గండిలో వేయడం వలన చెన్నారం గ్రామ గీత కార్మికులు వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ కార్యాలయముందు నిరసనకు దిగారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో చెన్నారం చెరువు వద్ద కు పోయి విజిట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మరుపట్ల అరుణ గారులు మాట్లాడుతూ చెరువు కట్ట చివర మత్తడి దగ్గర కల్లు పరే చెట్లు ఇవి కట్టకు ఎలాంటి హాని లేకుండా ఉన్నాయి.మత్తడి దగ్గర ఒక్క చిన్న బుంగ పడ్డది అక్కడ ఒక్క పది,ఇరువై తట్టల మట్టి పోస్తే సరి పోతుంది,అవసర మానుకుంటే మట్టి పోయకున్న అవసరం లేదు.ఎందుకంటే కట్ట చివర కాబట్టి చెరువులో నీరు పోదు ఎందుకంటే గంగపుత్రులు చేపలు పోకుండా వల చుట్టారు చెరువులో నీరు ఆ వల అవుతలనే ఆగి ఉంటాయి.కానీ అక్కడ బి.ఆర్.ఎస్ నాయకులు రాజకీయ కుట్ర చేసి అధికారులను తప్పు దోవ పట్టించి గౌడ సంఘం వారికి అన్యాయం చేయడం జరిగింది.తక్షణమే అక్రమంగా కల్లు పరే చెట్లను తొలగింపు నకు కారణమైన వారి పై సంబంధింత అధికారులు చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి గౌడ సంఘానికి కార్మికులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కళ్లేపు రాజు,మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బర్ల సతీష్,అధికార ప్రతినిధి బర్ల సహదేవ్,మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ, పెండ్యాల బిక్షపతి, దొమ్మటి రాజు,కలకోటి దేవేందర్, గుజ్జ యాకయ్య,జనగాం చిన్న యాకయ్య, బర్ల విజయ్,కట్ట రాజు ,మురళి,రాములు పాల్గొన్నారు.