వినాయక చవితి పండుగ సందర్భంగా శనివారం కల్లూరు గ్రామం తరిమెల రోడ్డులోని మహాగణపతి కి ఘనంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.మహాగణపతిని దర్శించుకోవడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.ఉదయం నుంచి ప్రజలు తండోపతండాలుగా మహాగణపతిని దర్శించుకున్నారు.భక్తాదులకు తీర్థప్రసాదాలను కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాగణపతి దగ్గర రేపు అన్నదానం నిర్వహిస్తున్నామని ప్రజలు పాల్గొని మహాగణపతి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్ ఆచారి, దబ్బర హరికృష్ణ, రమేష్ నాయుడు, నల్లబోతుల రాజశేఖర్, సాయి, శివ, రాంమోహన్, హరి, రఘు తదితరులు పాల్గొన్నారు.