ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి ఆదిలాబాద్ లో గల నివాసంలో తాంసి మండలానికి చెందిన 8 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని కులాలకు,మతాలకు అండగా నిలుస్తూ సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు. స్వంత రాష్ట్రంలో పేదింటి బిడ్డకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, తాంసి మండల ఎంపిపి మంజుల శ్రీధర్ రెడ్డి గారు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్ గారితో పాటు తదితర నాయకులు ఉన్నారు.