కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత సాధ్యం
Muluguఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో మహిళా కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మహిళా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో 9 ఏండ్లుగా రోజురోజుకు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనను పూర్తిగా గాలికి వదిలేసి, నిత్యం రాజకీయ ఎత్తుగడల మీద కాలం వెళ్లదీస్తున్నారు అని
భారతదేశం సంస్కృతీ సాంప్రదాయలకు నిలయం. వేల ఏండ్లుగా స్ర్తీలను దేవతలుగా పూజించే దేశం కానీ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వారి భద్రత ప్రమాదంలో ఉందని ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళా పై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి అని సీతక్క గారు అన్నారు
గడిచిన బిజెపి బి. ఆర్ ఎస్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకిన పరిస్థితి కాంగ్రెస్ హాయం లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ 1250 అయింది నూనె,పప్పు,ఉప్పు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత సాధ్యం అని మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇండ్లు కట్టిస్తం,1250 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 500 కే ఇస్తాం అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి బండి శ్రీనివాస్ నల్లెల భరత్ కుమార్, రాసు పూత్ సీతారాం నాయక్
కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు