
kadiyam kavya thammadapally g
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (జీ) గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు హన్మకొండలోని ఎమ్మెల్యే కడియం నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుజ్జరి రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. నన్ను నమ్మి వచ్చే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా పని చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో జఫర్గడ్ ఎంపిపి రడపాక సుదర్శన్,పిఎసీఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్ రావు, వైస్ ఎంపిపి కొడారి కనకయ్య , ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.