
mulugu news telugu galam e69news loacl news
-జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్.
శుక్రవారం రోజున వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీ ఆదివాసులతో సమావేశం జరిగింది, ఈ సందర్భంగా జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి దొర కొమురం భీం కాలనీ ఆదివాసులతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 5 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమిపై నీటిపై అడవిపై సర్వహక్కులు ఆదివాసీలకి ఉన్నాయని. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొమరం భీం కాలనీ ఆదివాసులు ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 44/P లో ఆదివాసులు 30 సంవత్సరాల నుండి స్థానికంగా ఉన్నప్పటికీ ఇక్కడున్న బడ గిరిజనేతరులు ఆదివాసులపై దౌర్జన్యంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కూడా కొమరం భీమ్ కాలనీ ఆదివాసులపై దాడులు చేసినప్పటికీ పై అధికారులు కూడా స్పందన లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ చట్టాలపై అవగాహన లేని అధికారులను తక్షణమే మైదానం ప్రాంతానికి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితిలోనే ఐదో షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు భూమిపై నీటిపై అడవిపై సర్వహక్కులు ఆదివాసులకే ఉన్నాయని చట్టం చెబుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆదివాసులు నిరుద్యోగ యువత అందరూ మైనారిటీలో పడిపోయారని, షెడ్యూల్ ఏరియాలో ఐదు షెడ్యూలు పెసా చట్టం ప్రకారంగా ఆదివాసులకు హక్కు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎందుకు అర్థం లేకపోతున్నారని ఆయన అన్నారు. ఏటూరునారం ఐటిడిఏ తక్షణమే లీగల్ సెల్ విభాగం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.ఆదివాసులకు ప్రత్యేకంగా స్వయం పాలన కోసం వందరోజుల దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదివాసులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కొమరం భీం కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు.