
mulugu news
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క శుక్రవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ములుగు నియోజకవర్గ విస్తృత సాయి సమావేశానికి ముఖ్యఅతిధులుగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ &స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క మాట్లాడుతూ నా గెలుపునకు అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పని చేసుకుంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించుకుంటూ నా దృష్టికి తీసుకురావాలని, నన్ను గెలిపించిన మీ అందరికీ కుటుంబ సభ్యురాలిగా ఆడబిడ్డగా అండగా ఉంటానని కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తానని రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరుతూ ప్రజలందరికీ ప్రజా సేవ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, జిల్లా మండల అనుబంధ సంఘాల నాయకులు,యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.