
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బ్రిటిష్ పాలన కింద బానిస జీవితం గడుపుతున్న దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలను అందించింది కాంగ్రెస్. భారతదేశానికి స్వాతంత్ర్య పోరాటంలో స్వాతంత్ర్యం సాధించిన కాంగ్రెస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. స్వాతంత్య్రం కోసం ఎంతో మంది కాంగ్రెస్ నేతలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఎందరో అమరుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అని అన్నారు.
నేడు ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతల ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో కొంత మంది యకులు మహాత్మా గాంధీ గారిని హత్యచేసిన గాడ్సే ని బి.జే.పి కీర్తించడం బాధాకరమని అన్నారు స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. IYC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త ఓటర్ నమోదు డిజిటల్ మొబైల్ వ్యాన్ ను ప్రారంభించిన నాయిని…
ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త ఓటర్ నమోదు డిజిటల్ మొబైల్ వ్యాన్ ను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య గారు జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వరంగల్ పార్లమెంట్ లో ప్రారంభించడం జరిగింది.
కొత్తగా ఎవరైనా ఓటు నమోదు చేసుకోవాలన్న మొబైల్ వ్యాన్ పై ఉన్న స్కానర్ పై మీ మొబైల్ నుండి స్కాన్ చేస్తే ఓటర్ నమోదు పేజ్ వస్తుంది. దాంట్లో మీ వివరాలు టైపు చేసి సబ్మిట్ చేసాక ఓటర్ ఐ.డి. నెంబర్ వస్తుంది. పదిహేను రోజుల తర్వాత ఓటర్ ఐ.డి. కార్డు మీ ఇంటికి వస్తుంది. ఈ మొబైల్ వ్యాన్ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి రోజు డివిజన్ లల్లో నియోజకవర్గాల్లో తిరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య,వర్ధన్నపేట నియోఅజక్వర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పోరేటర్ తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టిపిసిసి సభ్యులు గంగారపు అమృత రావు, పిసిసి మాజీ సబ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, AIUWC జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వప్న, ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ, కర్నాటక ఇంచార్జి మరియు వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి, జి. సాగరిక రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. రమాకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, టిపిసిసి మైనారిటీ డిపార్టుమెంటు ప్రధాన కార్యదర్శి ఖాజా మొహినుద్దిన్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కార్యదర్శి పులి రాజు, టిపిసిసి ఎస్.సి. డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్ కే. భారతి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్, అంబేద్కర్ రాజు, డివిజన్ అద్యక్షులు బాబా భాయ్, మహమ్మద్ జాఫర్, కొండా నాగరాజు, తక్కలపల్లి మనోహర్, పాలడుగుల ఆంజనేయులు, సయ్యద్ అఫ్సర్, గజపాక రమేష్, సయ్యద్ అజ్గర్, బి. శ్రీధర్ యాదవ్, వల్లపు రమేష్, కొండుక ప్రదీప్, తడక సుమన్, మేరి. కొంటె సుకన్య,MV. రాజు, రూపిరెడ్డి సాయి రెడ్డి, బొంత సారంగం, ఎర్ర మహేందర్, వంశీ, సంగాల ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రవణ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సంసాని వంశీ, జి.శివ, మహమ్మద్ అబ్దుల్ బాఖి, మహమ్మద్ సాజిద్ ఫైముద్దిన్, , ఇబ్రహీం, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ సుభాని, మహమ్మద్ అజహర్ హుస్సేన్, సయ్యద్ అమీర్ హుస్సేన్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ అబ్దుల్ అలీం, మహమ్మద్ మహబూబ్ పాషా, మహమ్మద్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.