
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ కార్యదర్శి గా ఉమారఘువీర్
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మంగళవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మహిళ అధ్యక్షు రాలు అనురాధ లు మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన ఉమరఘువీర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా జిల్లా మహిళా కార్యదర్శిగా నియమించినట్లు ఉమరఘువీర్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..నా పై నమ్మకం తో పార్టీ ఇచ్చిన ఈ పదవి కి న్యాయం చేస్తూ జిల్లా లో పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే మహిళలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వివరిస్తూ ముందుకు సాగుతానని ఆమె అన్నారు. అలాగే నా ఎన్నికకు సహకరించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకన్న యాదవ్, మహిళ అధ్యక్షు రాలు అనురాధ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.