కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మున్సిపాలిటీలకు మహర్దశ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
మరిపెడ మున్సిపాలిటీలో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు, డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ అధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి లాంచనంగా శంకుస్థాపన చేసారు, ఆరు కోట్ల పై చిలుకు పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో రెండు కోట్లతో రోడ్డు సైడ్ డ్రైనేజీ, సెయింట్ అగస్టింగ్ స్కూల్ నుండి మరిపెడ రోడ్డు వరకు సిసి రోడ్డు నిర్మాణం, రామ్ విలాస్ స్ట్రీట్ బిటి రోడ్డు నిర్మాణం మొదలగు పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేవు అన్నారు, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మున్సిపాలిటీలకు మార్దశ పట్టానుంది అని, మున్సిపాలిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అన్నారు, సైడ్ డ్రైనేజీ సదుపాయం లేకపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి వచ్చి నిలుస్తుంది అని దాంతో పాదచారులు నడవడానికి ఇబ్బంది పడతారు అన్నారు,వాహనదారులకు ప్రమాదాలు జరుగుతాయి అన్నారు,ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు చెరువుల్లా మారి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది అని,
మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది అని,అలాగే రోడ్డు పై పొర్లే నీటితో రోడ్లు త్వరగా దెబ్బతిని గుంతలు ఏర్పడతాయి అన్నారు,దీనివల్ల ప్రభుత్వానికి అదనపు వ్యయం భరించాల్సి వస్తుంది అన్నారు,సక్రమంగా నిర్మించిన సైడ్ డ్రైనేజీలు పరిశుభ్రతను కాపాడడమే కాకుండా, వర్షపు నీరు వేగంగా పారిపోయేలా చేస్తాయి అన్నారు,దీంతో వరదల ముప్పు తగ్గుతుంది అని పట్టణాల అందం కూడా మెరుగవుతుంది అన్నారు,నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా పనులు పూర్తి చేయాలన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్‌లాల్, మాజీ ఎంపీటీసీ అంబారీష,రవి నాయక్,పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్,అప్జల్,యూత్ నాయకులు జాటోత్ సురేష్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.