
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎన్ఎం-II ల తోను ఉద్యోగులను, అర్బన్ హెల్త్ ఎన్ఎం లను రెగ్యులరైజ్ అక్రమంగా అరెస్ట్ దారుణం…
మహిళలు అని చూడకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎన్ఎం-II లను ఉద్యోగులను, అర్బన్ హెల్త్ ఎన్ఎం లను అసెంబ్లీ ముట్టడికి వీరికి సంభందం లేకుండా ఉదయం 3 గంటలకు కాజిపేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం.
కమూనిస్ట్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడికి వైద్య ఉద్యోగ సంఘాలకు ఎటువంటి సంభందం లేదు.
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎన్ఎం-II లను ఉద్యోగులను, అర్బన్ హెల్త్ ఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి కమ్యూనిస్ట్ పార్టీ CITUC సమ్మెకు పిలుపు నివ్వడం జరిగింది.
హైదరాబాద్ మెడికల్ హెడ్ ఆఫీస్ నుండి ఉద్యోగుల పేర్లు ఫోన్ నంబర్లు తీసుకొని అన్ని జిల్లాలకు సమాచారం అందించి అన్ని సంఘాల వారు పాల్గొంటారని ముందస్తు అరెస్ట్ చేయడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
జిల్లలో ఉన్న అన్నిక్యాడర్ల సంఘాల లీడర్లను పోలీసులు అక్క్రమంగా అరెస్ట్ చేసారు. ఈ సమ్మెకు వీరికి ఇన్వాల్వ్ మెంట్ లేకున్న అక్రమంగా అరెస్ట్ చేసారు.
ప్రభుత్వానికి భయం పట్టుకుంది. మేము పిలుపిస్తే వేల మంది వస్తరు.
మహిళలు అని చూడకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం.
కరోన సమయంలో వైద్య ఉద్యోగులు ఎంతో కష్ట పడ్డారు. అలాంటి వారిని ఉదయం 4 గంటలకు దొంగల తీరుగా వారిని తీసుకు వచ్చి అరెస్ట్ చేసినారు.
ఆరెస్ట్ చేసిన వారిలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉన్నావారు. చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు. వారు మొఖాలు కడగలేదు మెడిసిన్ వేసుకోలేదు. వారికీ కూడా ఫ్యామిలీ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1520 ఏ.ఎన్.ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాత పరీక్ష రాయాలని ఇంగ్లీష్ లో పరీక్ష ఉంటుందని, 49 ఏండ్లు నిండిన వారికి అవకాశం కల్పించకుండా నిబందనలు పెట్టారని , రెండు దశాబ్దాలుగా రెగ్యులర్ కాకుండా సమాన పనికి సమాన వేతనం అమలు కాకుండా పని చేస్తున్నారని అన్నారు.
ఈ సమస్య గురించి సిఎల్.పి. నేత మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి వివరించి అసెంబ్లీలో చర్చించాలని కోరుతానని వారికీ హామీ ఇవ్వడం జరిగంది.
వైద్య ఉద్యోగ నాయకులు సుదర్శన్, ఓ సందీప్ కుమార్, ఎస్. విజయ, రజిని, ఎన్. స్వరోఒప, జి.సౌజన్య, బి. మని, బి.స్వరూప, డి. సుదర్శన్, ఎస్, సుజాత, బి.లలిత, రజియ సుల్తన, పి. సంగీత, పి. జ్యోతి, పి. కిరణ్, క్రాంతి, కే. రాకేశ్, ఎస్. రమాదేవి, టి. మాధవి లత, పి. నవీన్ తదితరులను అరెస్ట్ చేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహమ్మద్ అంకుష్, ఇప్ప శ్రీకాంత్, సంగాల ప్రశాంత్, క్రాంతి భరత్, కొండా శివ, డివిజన్ అధ్యక్షుడు పాలడుగుల ఆంజనేయులు, కే. సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.