
కాంట్రాక్టు ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగ్రామ సభను విజయవంతం చేయండి
ఈనెల 16న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో తెలంగాణ కాంట్రాక్టు హౌవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరిగే సంగ్రామ సభకు కాంట్రాక్టు హవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అందరు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి రాజు కోరారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి సంగ్రామ సభ విజయవంతం చేసేందుకు రావాలని సమావేశాలు నిర్వహించారు. కాంట్రాక్టు హవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ప్రకటన చేసి తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఇక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో లక్ష 40,000 మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వారందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు ఈ లోపు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వివిధ డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ రూపొందించడానికి ఏర్పాటు చేసిన సంగ్రామ సభకు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది తరలి రావాలని కోరారు ఈ సమావేశంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకులు సిబ్బంది పి స్వరూప సబితా ఉమా మహేశ్వరి హపీజ అమీనా మహూబీ జి సబిత లావణ్య బాబు తదితరులు పాల్గొన్నారు.