కాంట్రాక్టు ANM లను రెగ్యులర్ చేయాలి
తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ CITU అధ్వర్యంలో ఈ రోజు అనగా 15-08-2023 నుండి రాష్ట్ర వ్యాపితంగా సమ్మె శంఖారావం పూరించిన ANM లు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లపల్లి సుధాకర్ మాట్లాడుతూ ANM ల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గం గా ఉంది అని ధ్వజమెత్తారు గత 16 సంవత్సారాలు పని చేస్తున్న ANM లు కరోనా కష్టకాలం లో ప్రాణాలను పణం గా పెట్టి తెలంగాణ సమాజం కోసం పని చేస్తే ప్రభుత్వం వారి పట్ల కనీసం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు . రాష్ట్ర ప్రభుత్వానికి అడబిడ్డలపై ఏమైనా సోయి ఉంటే వారి న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ యొక్క సమ్మె లో ఆర్.సునీత , కె .సదాలక్ష్మి,బి.దీన,
బి.కలాప్రియ , కే.మంజుల యు.కృష్ణ మూర్తి ,చారి తదితరులు పాల్గొన్నారు