
చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపులేవి?
అంబేద్కర్ అభయహస్తం అటుకెక్కినట్టేనా?
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
2025- 26 ఆర్థిక సంవత్సరంలో 3,04,965 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 40,231, 61, 80 కోట్ల రూ. లతో ఎస్సీ ఎస్ డి ఎఫ్ క్రింద కేటాయించారని కాగితాల్లో అంకెలు పెంచుతూ ఖర్చులు తుంచుతున్నారని ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపు జరగలేదని అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయల కేటాయిస్తామాన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోయిందని బడ్జెట్ ను సవరించి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు
బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కెవిపిఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు రాష్ట్రంలో సుమారు 18 శాతం ఉన్న దళితులకు ప్రతి ఏటా బడ్జెట్లో అంకెలు పెంచుతూ ఖర్చులు మాత్రం తుంచుతున్నారని 2024- 25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ లో నూటికి 30% కూడా ఖర్చు చేయలేదన్నారు 2023- 24 బడ్జెట్లో 13,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు కాగితాల్లో అంకెలుపెద్ద మొత్తాలలో పెంచుతున్నారని అవి ఖర్చు చేయని నిధులను సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా వచ్చే ఏడాది బడ్జెట్లో ఖర్చు చేయాలని చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు దళితుల యొక్క ఆవాసాలు విద్యా వైద్యం రహదారులు త్రాగునీరు వంటి మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి సారించలేదని చెప్పారు రాష్ట్రంలో 64 లక్షల జనాభా కలిగిన దళితులకు కనీస ప్రాథమిక అవసరాలు తీర్చే విధంగా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఏ బి సి గ్రూపులుగా విడగొట్టిన ప్రభుత్వం, పెరిగిన దళిత జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచలేదన్నారు గత ఏడాది క్రిందట చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించిన ప్రభుత్వం ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామని 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం కింద కేటాయిస్తామన్న మాటకు ఈ బడ్జెట్ లో నయా పైస కేటాయించలేదన్నారు మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి దళితుల యొక్క మౌలిక అభివృద్ధికి కృషి చేస్తామన్న మాట నీటి మూటగా మారిందన్నారు ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడిచినప్పటికీ దళిత అభివృద్ధి శాఖకు ఎందుకు మంత్రిని నియమించలేదో చెప్పాలన్నారు.
2020-21 లో 16,534 కోట్లు కేటాయించగా 11884 కోట్లు ఖర్చు చేశారని, 2021- 22లో 21,306 కోట్లు కేటాయించగా 17085 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని 2022- 23 బడ్జెట్లో 33,937 కోట్లు కేటాయించగా 15440 కోట్లు ఖర్చు చేశారని 2023-24 బడ్జెట్లో 36,750 కోట్లు కేటాయించగా 14,648 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని 2024- 25 బడ్జెట్లో 33,127 కోట్లు కేటాయించగా 9,824 కోట్లు మాత్రమే ఖర్చు చేసి సుమారు 70% నిధులు ఖర్చు చేయలేదని చెప్పారు. 70% బడ్జెట్ ఖర్చు చేయకుండా దళితుల అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. రాష్ట్రంలో దళితులు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల బకాయి పెండింగ్లో ఉండటం సరికాదన్నారు. హాస్టల్ లో అద్దె భవనాల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు .ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం బాధితులకు సరైన సమయంలో చెల్లించడం లేదన్నారు కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల ప్రోత్సాహకాలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 2016 నుంచి నేటి వరకు పెండింగ్లో ఉండటం విచారకరమన్నారు గత ఏడాది సుమారు పది శాఖలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు పేదల భూ పంపిణీ ఊసే లేదన్నారు దాడులకు గురవుతున్న వారికి నష్టపరిహారం తక్షణ సహాయం అందించడం లేదన్నారు.పునరావాసం కల్పించడం లేదని చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం హైపర్ కమిటీ సమావేశం జరగట్లేదన్నారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల పై నోడల్ ఆఫీసర్ ద్వారా ఆడిట్ చేయించాలన్నారు సబ్ ప్లాన్ నిధులలో జవాబు ద్వారా తనాన్ని పెంపొందించాలని ఎస్సీ ఎస్టీ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు చర్చల సందర్భంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మొత్తం దళితుల గిరిజనుల సబ్ ప్లాన్ నిధులపై ప్రత్యేక చర్చను ఏర్పాటు చేసి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు బడ్జెట్ పై పునరాలోచన చేసి దళిత అభివృద్ధి శాఖకు మంత్రిని నియమించాలన్నారు చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు సరిపడా నిధులు కేటాయించాలని అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరుతూ మార్చి 22న నల్గొండ జిల్లా sc కార్పొరేషన్ ముందు బడ్జెట్ పై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కెవిపిఎస్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు