కాన్షిరాం స్పూర్తితో మనువాద పాలన నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం
Uncategorizedబిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభి నాయక్
మరిపెడ గళం న్యూస్.
మాన్యవర్ కాన్షిరాం స్పూర్తితో మనువాద పాలన నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత బహుజనులదేనని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ కోరారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ మండలంలొ బిఎస్పీ మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి అధ్యక్షతన మాన్యవర్ కాన్షిరాం 90వ, జయంతి ఘనంగా నిర్వాంచారు.ముందుగా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి, మాన్యవర్ కాన్షిరాం చిత్రపటానికి పూలమాల వేసి మరిపెడ,గుండెపూడి, బురహాన్ పురం, తానంచర్ల, వాల్యతండా, తాళ్లఊకల్, వెంకంపాడు,బావోజీగూడెం, నీలికుర్తి, అనేపురం, వెంకట్ తండా, స్టేజ్ తండా, మరిపెడ బంగ్లా, అబ్బాయిపాలెం గ్రామాలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అబ్బాయిపాలెం గ్రామంలోని మహనీయులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మాన్యవర్ కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా తెజావత్ అభినాయక్, విశిష్ట అతిధులుగా లంబాడిల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్యసమన్వయ కర్త గుగులోత్ రమేష్ నాయక్ లు పాల్గోని వారు మాట్లాడుచు కేంద్రంలో మత తత్వ బీజేపీ పార్టీ రెండొవసారి అధికారంలోకి వచ్చి బహుజనులకు తినే తిండి మీద,బట్టమీద, సంస్కృతి సంప్రదాయాలమీద,అంక్షలు విధించి ,మతమైనార్టీలపై దాడులు డౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.మూడవసారి గెలిచి భారత రాజ్యాంగాని తీసివేసి మనుధర్మ శాస్త్రన్ని అమలుపరుచుటకు సిద్ధంగా ఉన్నదని అల జరిగితే మళ్ళీ మన పూర్వికుల్లగా బానిసలమౌతామని అందుకే మన తరుపున పార్లమెంట్ లొ మాట్లాడేందుకు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆరెస్ పార్టీ తొ ఎన్నికల పోత్తు పెట్టుకున్నారని దానిని మీము సాధారంగా ఆహ్వానిస్తున్నమని బహుజనులకు రాజ్యాధికారం కోసం దయ్యాలతోనైనా పొత్తుపెట్టుకుంటామని అనాడె మాన్యవర్ కాన్షిరాం అన్నారని ఆయన లక్షాలకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బిఎస్పీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, డోర్నకల్ అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త, మరిపెడ మండల ఉపాధ్యక్షులు గుగులోత్ భాసునాయక్, కురవి మండల మహిళ కన్వీనర్ కొప్పుల అనూష, మరిపెడ మండల నాయకులు,గుగులోత్ నితిన్ నాయక్, గుగులోత్ రామారావు,వివిధ గ్రామాల నాయకులు మాదారపు సాయి కిరణ్,దారావత్ రాజేష్ నాయక్,జినక సురేష్,ఉపేందర్, కొండ్రు మనీత తదితరులు పాల్గొన్నారు.