
ఈ69న్యూస్ జనగామ,ఏప్రిల్16:సిపిఐ పార్టీ జనగామ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆది సాయన్నతండ్రి ఆది యాదగిరి బుధవారం ఉదయం 5 గంటల సమయంలో అనారోగ్యంతో పరమపదించారు.మధ్యాహ్నం1 గంటకు తన స్వగ్రామం అనంతారంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆది యాదగిరి మరణం పట్ల సిపిఐ జనగామ జిల్లా సమితి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ,వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించింది.పార్టీ తరఫున అమరవీరుడు ఆది యాదగిరికి శ్రద్ధాంజలి అర్పిస్తూ,జోహార్లు తెలిపింది.