జఫర్ఘడ్ నవంబర్ 21
ఘట్కేసర్ మండల్ అనోజుగూడాలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా 36వ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన జనగామ జిల్లా టెక్నికల్ డైరెక్టర్ జఫర్గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన ఎల్మకంటి సుమన్ బ్లాక్ బెల్ట్ 3డాన్ జపాన్ డిప్లొమా గోల్డ్ మెడల్ (ఫస్ట్ ప్రైజ్ )సాధించాడు.స్టేట్ లెవెల్స్ టోర్నమెంట్ తో దాదాపు 600 మంది పైగా పాల్గొన్నారు.ఒకే ఒక్కడు ఎల్మకంటి సుమన్ తన గుండె ధైర్యం కండబలం పట్టుదల స్వయం కృషితో పోరాడి ఘన విజయం సాధించాడు.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఎగ్జామినేనర్ రాపోల్ సుదర్శన్ గోల్డ్ మెడల్ సాధించిన ఎల్మకంటి సుమన్ ని అభినందించారు.మరో విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. 2023 జనవరి 28న గోవాలో అంతర్జాతీయ టోర్నమెంట్ కి ఎల్మకంటి సుమన్ ని ఎంపిక చేశారు.