రహమత్ నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్ రెండు బొమ్మల వద్ద సిఐటియు ఆవిర్భా దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరిస్తున్న సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ జె ,స్వామి.* కార్మికులకు పట్టణ ఉపాధి హామీ కల్పించాలి, కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించాలి, ఘనంగా సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం……….., ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన సిఐటియు నాయకులు రాపర్తి అశోక్ భారత కార్మికో ఉద్యమ చరిత్రలో సిఐటియు ఆవిర్భావం ఒక చారిత్రక అవసరఘట్టం 1970 మే 30న పశ్చిమబెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆవిర్భవించింది. 54 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన నిలబడి నేటికీ దేశవ్యాప్తంగా 22 సమ్మెలు చేసి కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించడంలో ముందుండి పోరాటం చేసింది. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కార్మిక లేబర్ కోడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దినదినం అభివృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా 8 గంటల పని దినాలు, సంఘం పెట్టుకునే హక్కు కోసం, కార్మిక శాఖ అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం ,స్కీం వర్కర్ల పెన్షన్ల కోసం కార్మికుల్లో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఐక్యమ్ చేసి ముందుంటున్నటువంటి సిఐటియు సంఘమును దేశంలో బలపరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన ప్రజలందరినీ కలుపుకొని ఐక్య పోరాటాలు కార్మిక వర్గ నాయకత్వాన భవిష్యత్తులో నిర్మించాల్సి అవసరం ఉందానే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. 1.పట్టణ కార్మికులకు పట్టణ ఉపాధి హామీ పథకం కల్పించాలి, 2.అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, 3.కనీస వేతనం 26,000 చట్టంగా చేయాలి. 4.ఇల్లు లేని కార్మికులందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రహమత్ నగర్ డివిజన్ కార్యదర్శి దేవదాసు, నాయకులు భాగ్యరాజు, ఏ ఆర్ నరసింహ, బాలయ్య, రాజు, కురుమూర్తి ,కాశప్ప తదితరులు పాల్గొన్నారు.