కార్మికుల సంక్షేమ పథకాలు ఎత్తివేసే కుట్ర ను తిప్పికొట్టండి
రాష్ట్రం లో సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న పథకాలను ఇన్స్ రెన్స్ కంపెనీలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ & అదర్ కనస్త్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆద్వర్యం లో కార్మిక శాఖా అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జాకీర్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ మాట్లాడుతూ 1996 కేంద్ర చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్ర సంక్షేమ బోర్డు లను నీరు గార్చడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపే రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా అమలు జరుపుతున్న పథకాలను ఇన్స్ రెన్స్ కంపెనీల కు అప్పగించడం తప్ప మరొకటి కాదన్నారు.రాష్ట్రం లో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే 15 లక్షల మంది కార్మికులను మాత్రమే రెన్యువల్ చేశారని అన్నారు.
సంక్షేమ బోర్డు లో ఉన్న కార్మికుల క్లెయిమ్ లు భారీగా పెండింగ్ లో ఉన్నాయని,
వాటికి కేటాయించిన బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం వేరే అభివృద్ధి పనులకు మల్లించిందని అన్నారు.పెండింగ్ లో క్లెయిమ్ లను పరిష్కరించమని కార్మికులు,యూనియన్ లు డిమాండ్ చేస్తుంటే,వాటిని పరిష్కరించకపోగా,సంక్షేమ బోర్డు ద్వారా అమలు జరుపుతున్న పథకాలను ఇన్స్ రెన్స్ కంపెనీలకు ఇవ్వడం అని అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవడం తప్ప మరొకటి కాదన్నారు.సంక్షేమ బోర్డు లోని 1350 కోట్లను దారి మళ్లించి,
కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.సంక్షేమ బోర్డు సలహా మండలిని ఏర్పాటు చేయకుండా,కార్మిక సంఘాల భాగస్వామ్యం చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు.
సంక్షేమ పథకాల అమలు బాధ్యత ఇన్స్ రెన్స్ కంపెనీలకు అప్పగిస్తే చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్ లను తిరస్కరించే పరిస్థితి ఉండటమే కాక అడ్డగోలుగా షరతులు పెట్టి కార్మికులకు పథకాలు వర్తించకుండా చేసే పరిస్థితి వస్తుందని అన్నారు సిఐటియు కన్వీనర్ యం.బీ.నర్సారెడ్డి మాట్లాడుతూ సిఐటియు నాయకత్వం లో పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ని కాపాడుకోవడానికి సమర శీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ప్రమాద మరణం 6 లక్షల 30 వేల రూపాయలు నుండి 5 లక్షలకు తగ్గించే ప్రతిపాదన టెండర్లలో ఉన్నదని,వివాహం,ప్రసూతి,
సహజ మరణం,పెన్షన్,స్కాలర్ షిప్ లు,గృహ వసతి,అడ్డాలలో సౌకర్యాలు కల్పన వంటివి ఎండమావిలాగా మారిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు.
గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మోటార్ సైకిల్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులు 1350 కోట్లను వెంటనే వెనక్కి తెప్పించాలనిని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం లేబర్ అధికారి ఏసుపాదం కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.స్పందించిన ఏసు పాదం మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలను తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సి ఐ టి యు పట్టణ కమిటీ సభ్యులు నకిరి కంటి నాగరాజు,బిల్డింగ్ వర్కర్స్ యునియన్ పెయింటర్స్, చాట్ల శ్రీనివాసరావు దుర్గారావు రాము వేణు జిన్నా రాజు తో పాటు రాడ్ బెండింగ్,మార్బుల్,యూనియన్ నాయకులు.