
సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు
ఉద్యోగులకు కార్మికులకు మేలు చేసేలా బడ్జెట్ సవరించాలి
— సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు~~
జఫర్గడ్: రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2025 -26 వార్షిక బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని వారికి మేలు చేసేలా బడ్జెట్ సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గురువారం రాపర్తి రాజు మాట్లాడుతూ 3,04,965 ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కోటి యాభై లక్షల మంది ఉన్న కార్మికులకు కేవలం 900 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించి నిరుత్సాపరిచిందని అన్నారు లక్షల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు గురించి ప్రస్తావన లేదు పర్మినెంట్ గురించి ఊసే లేదని విమర్శించారు గ్రామపంచాయతీ మున్సిపల్ స్కీమ్ వర్కర్ల వేతనాల పెంపుదల గురించి బడ్జెట్లో కేటాయింపులు లేవు అన్నారు హమాలీ, ట్రాన్స్పోర్ట్ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం గురించి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు గాని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎదురుచూస్తున్న రెండవ పిఆర్ సి గూర్చి నామాత్రంగా కూడా ప్రకటన చేయలేదు రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుదల కోసం జీవో సవరించాలని ఏళ్ల తరబడి కార్మికుల పోరాడుతున్నారు వారి వేతనాలు పెంచే విధంగా కనీసం మాట కూడా మాట్లాడలేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్లో కనిపించటం లేవని అన్నారు వివిధ రంగాల ఉద్యోగ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్ ను సవరించాలని సంక్షేమం కోసం తగిన నిధులను కేటాయించాలని లేనిపక్షంలో రాష్ట్రంలో కార్మిక వర్గం నిరసనలను ఆగ్రహాన్ని ప్రభుత్వం తొందరలోనే ఎదుర్కోక తప్పదని రాపర్తి రాజు హెచ్చరించారు